తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రంగారెడ్డి జిల్లా యాచారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో 11వ ఆయుర్వేద దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు.వైద్యాధికారి డాక్టర్ ఉమారాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ.. ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేదం ఎంతో విశిష్టమైనదని అన్నారు. ఆయుర్వేదం ద్వారా ఆరోగ్య పరిరక్షణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం ఆయుర్వేద వైద్య విధానాన్ని మరింత విస్తృతంగా ప్రజలకు చేరువ చేయాలని సూచించారు. ఈ ఏడాది “ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం” అనే ఇతివృత్తంతో ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయుర్వేద వైద్య విధానంలోని ప్రయోజనాలను ప్రజలకు వివరించి, ఆరోగ్య పరిరక్షణలో దాని ప్రాధాన్యతను తెలియజేయాలని అన్నారు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు డాక్టర్ కిరణ్మయి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.