తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్‌లో టీమ్ బీవైఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సందర్శించారు. ఈ సందర్భంగా మండపంలో కొలువుదీరిన గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా టీమ్ బీవైఏ సభ్యులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ను ఘనంగా స్వాగతించి, మండపానికి విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గణేష్ మండపాన్ని సందర్శించడంతో నిర్వాహకులు, భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీమ్ బీవైఏ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
