తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మరియు కుటుంబ సభ్యులు నల్లగండ్ల వర్టెక్స్ కింగ్స్టన్ పార్క్ విల్లాస్, క్లబ్ హౌస్ లో 27వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12:30గం. లకు ప్రముఖ సామాజిక సేవకురాలు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంకితమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్ జ్ఞాపిక సందర్భంగా పెద్దలకు బియ్యం ఇచ్చే కార్యక్రమం సహపంక్తి భోజనం నిర్వహిస్తున్నందున అందరికీ పుణ్యస్మరణ ఆత్మీయ ఆహ్వానాన్ని అందజేస్తున్నారు. పుణ్యస్మరణ కార్యక్రమానికి అందరూ సకాలంలో విచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్ పవిత్ర ఆత్మకు నివాళులు అర్పించగలరని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మరియు కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
