తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : సమాజంలో సమానత్వం, బహుజనాల ఆత్మగౌరవమే నా జీవిత లక్ష్యం అని చాటిచెప్పిన మహోన్నత స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ జాతిపిత శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవ సమితి వైస్ చైర్మన్, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం స్టేట్ యూత్ ప్రెసిడెంట్ అంబటి శ్రీనివాస్ తెలిపారు.
ఈ మేరకు ఆయన శనివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం తన మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా త్యాగం చేసిన గొప్ప అమరజీవి, ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. బహుజన నాయకులు, పద్మశాలి సంఘాల సమక్షంలో నిర్వహించే ఈ జయంతి వేడుకలను ప్రజలందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తేదీ: సెప్టెంబర్ 27, సమయం: ఉదయం 10:00 గంటలకు వేదిక: రవీంద్ర భారతి, హైదరాబాద్
తెలంగాణ సమాజం కోసం, బహుజనుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన బాపూజీ గారి సేవలను స్మరించుకుంటూ నిర్వహిస్తున్న ఈ వేడుకలకు బహుజన శ్రేణులు, పద్మశాలి బంధువులు, తెలంగాణ ఉద్యమకారులు మరియు అభిమానులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన హృదయపూర్వకంగా కోరారు.
