తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ హుడా కాలనీలోని హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతి శనివారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా 203వ వారానికి చేరుకున్నట్లుగా కొండా విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్బంగ కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ, అన్నదానం చేయడం ఆ భగవంతుని వరంగా భావిస్తున్నానని, ప్రతి శనివారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమంలో సుమారు 2500మంది అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారని, వచ్చిన వారందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా భోజనాల వడ్డింపు సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరిని అభినందిస్తూ, వారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. భోజనాల వడ్డింపు సేవలో ప్రతి శనివారం అంకితభావంతో సేవలందిస్తున్న మహిళా సంఘ సేవకురాలు ఎస్. భీమమ్మను ప్రత్యేకంగా శాలవాలతో సత్కరించి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్. భీమమ్మ మాట్లాడుతూ, అన్నదాన కార్యక్రమం చేపట్టి సుమారు 2500మంది అన్నార్తులకు అన్నదానం చేయడం చాలా గొప్ప విషయమని ఈ కార్యక్రమంలో తనవంతు చేయూతగా భోజనాలు వడ్డించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. మా సేవలను అభినందించిన కొండా విజయ్ కుమార్ కు కృతజ్ఞతా భావం ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, ప్రతి ఒక్కరి హృదయాలలో కొండా విజయ్ కుమార్ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారని కొనియాడారు.
