తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: తెలంగాణ యాదవ కురుమ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్ కరీంనగర్ జిల్లాలోని గొర్రెల పెంపకదారుల సహకార యూనియన్ వారి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాలో కొత్త యాదవ భవన్ కోసం రూ.50లక్షలు మంజూరు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ను కోరారు. అలాగే గొర్రెలు, మేకలు ప్రమాదాలు, అనారోగ్యం, ఇతర కారణాలతో మృతి చెందడం వలన పశుపోషకులు తీవ్రంగా నష్టపోతున్నారని రఘునాథ్ యాదవ్ పేర్కొన్నారు. అందువల్ల పశుపోషకుల ఆర్థిక భద్రతకు గొర్రెలు, మేకలకు బీమా చేయించడం ఎంతో అవసరమని తెలిపారు. ప్రభుత్వం అందించబోయే బీమా పథకాన్ని యాదవ, కురుమ సోదరులు సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ కోరారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పశుసంవర్ధక ,క్రీడ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి , లైవ్ స్టాక్ కార్పొరేషన్ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్, షీప్ అండ్ గోట్ ఫెడరేషన్ చైర్మన్ శ్రీమతి సరిత , చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ గోట్ అండ్ షీప్ చైర్మన్ మల్లేశం యాదవ్ , వైస్ చైర్మన్ శ్రీనివాస్ కురుమతోపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు యాదవ కురుమ ప్రముఖులు, నాయకులు, గొర్రెలు, మేకల పెంపకందారులు పాల్గొన్నారు. అలాగే యాదవ సమాజం ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలంటే విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. విద్యనే మనిషికి, సమాజానికి అన్నిటికంటే గొప్ప ఆస్తి అని పేర్కొంటూ, తమ పిల్లలను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించాలని యాదవ సోదరులకు పిలుపునిచ్చారు.