తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : గాంధీ జయంతి సందర్భంగా శంషాబాద్‌లోని ఎస్‌ఎస్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన ఫోటో పండుగ కార్యక్రమంలో సీనియర్ ఫోటో వీడియో గ్రాఫర్ బిజ్జ విజయ్ కుమార్ ప్రతిష్టాత్మక భారత్ కళా పురస్కార్-2026 బెస్ట్ వీడియో గ్రాఫర్ అవార్డు అందుకున్నారు.హైదరాబాద్ ఫోటో ట్రేడ్ షో ఆధ్వర్యంలో ఫోటో పండుగను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఫోటో, వీడియో రంగ సంస్థలు పెద్ద ఎత్తున స్టాల్స్ ఏర్పాటు చేశారు . విశిష్ట అతిథి ఎడిటర్ పాయింట్ రమేష్ చేతుల మీదుగా బిజ్జ విజయ్ కుమార్ పురస్కారాన్ని స్వీకరించారు.ప్రతిష్టాత్మక పురస్కారం అందుకోవడం ఎంతో గర్వంగా ఉందనివిజయ్ కుమార్ తెలిపారు. తనకు అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
