తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : గణేష్ నగర్ నుంచి భావన ఋషి కాలనీకి వెళ్లే ప్రధాన మార్గంలో డ్రైనేజీ మురుగు నీరు రోడ్డుపైకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై మురుగు నీరు నిలిచిపోవడంతో పాటు చెత్త, చెదారం పేరుకుపోయి పరిసరాలు అస్తవ్యస్తంగా మారాయి.ఈ మార్గంలో ప్రతిరోజూ విద్యార్థులు, ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు, స్థానిక ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. మురుగు నీటిని తప్పించుకునే క్రమంలో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. దుర్వాసనతో పాటు దోమలు పెరిగి ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రజల సమస్యలు కళ్లముందు కనిపిస్తున్నా అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలించి, మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, రోడ్డుపై పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించాలని స్థానికులు డిమాండ్  చేస్తూన్నారు. ఇకనైనా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేని రహదారిని అందించాలని కోరుతున్నారు.