తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :  తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు అత్తాపూర్ సర్కిల్ పరిధిలోని పబ్లిక్ గార్డెన్‌లో ఘనంగా నిర్వహించారు. పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలతో మహిళలు వేడుకల్లో పాల్గొని పండుగ శోభను చాటారు. ఈ కార్యక్రమంలో అత్తాపూర్ సర్కిల్ డీపీఓ యుగేందర్ రెడ్డి, సీఓ విజయేందర్, రేణుకతో పాటు గ్రూపు సభ్యులు పాల్గొన్నారు.