‍• ఓరుగల్లు శ్రీ భద్రకాళి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఎంపీ రవిచంద్ర కు ఆహ్వానం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, వరంగల్: ఓరుగల్లు శ్రీ భద్రకాళిదేవి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం నుండి ప్రారంభం కానున్న సందర్బంగా బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర -విజయలక్ష్మి దంపతులను విరి కుమారుడు కోడలు వద్దిరాజు సాయి నిఖిల్ చంద్ర- అనిలా దంపతులను,మరియు సోదరులు వద్దిరాజు కిషన్-శశిరేఖ, వద్దిరాజు దేవేందర్- ఇందిరా,వద్దిరాజు వెంకటేశ్వర్లు- ఉమామహేశ్వరి దంపతులను దేవి నవరాత్రి ఉత్సవాలకు కుటుంబ సమేతంగా విచ్చేయవలసిందిగా కోరుతూ ఈరోజు వారి నివాసంలో శాలువాతో సత్కరించి అమ్మవారి ఆహ్వాన పత్రికతో పాటు తీర్థ ప్రసాదాలను అందించిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత. భద్రకాళి దేవాలయం ప్రధాన అర్చకులు శేషు అయ్యగారు, ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ ఈ నవరాత్రులు అమ్మవారికి మరియు అమ్మవారి శేష వాహనములకు ఉదయం సాయంత్రం ‘పూలంగిసేవ’ చేసుకునే భాగ్యం మా కుటుంబానికి కలగడం అమ్మవారు మాకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాము, ప్రతిరోజు ఉదయం సాయంత్రం వివిధ రూపల్లో కొలువుతిరే అమ్మవారిని,శేష వాహనములను వివిధ రకాల పుష్పములచే గజమాలలతో సర్వాంగ సుందరముగా అలంకరింపచేసి అంగరంగ వైభవంగా నిర్వహిస్తాము కావున భక్తులందరూ ప్రతిరోజు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులై తీర్థప్రసాదములు స్వీకరించగలరని కోరినారు.ఈ కార్యక్రమంలో అర్చకులు అరవింద్ శర్మ, భరద్వాజ్ శర్మ, ఆలయ సిబ్బంది సూపరింటెoడెంట్ కూచన హరినాథ్, నాగులు తదితరులు పాల్గొన్నారు..

హనుమద్గిరి పద్మాక్షి దేవి నవరాత్రి ఉత్సవాలకు ఎంపీ రవిచంద్రకు ఆహ్వానం

హనుమద్గిరి పద్మాక్షిని ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తున్న బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర నివాసానికి విచ్చేసిన ఆలయ అర్చకులు నాగిళ్ల షణ్ముఖ శర్మ అయ్యగారు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలకు కుటుంబ సమేతంగా రావాల్సిందిగా కోరుతూ అమ్మవారి ఆహ్వాన పత్రికతో పాటు తీర్ధప్రసాదాలు అందించడం జరిగింది..

Avatar photo

By Murthy