తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ డివిజన్, మైహోం మంగళ అపార్ట్మెంట్ సమీపంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో మహాలయ అమావాస్య సందర్భాన్ని పురస్కరించుకొని కొండాపూర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహాలయ అమావాస్య సందర్భాన్ని పురస్కరించుకొని ప్రదమంగా ప్రారంభించిన క్రమంలోనే సుమారు 350మందికి అన్న వితరణ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. దిగ్విజయంగా సాగిన అన్న వితరణ సేవా కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘం తరపున విరాళం అందజేసిన 60మంది దాతలకు, కార్యక్రమంలో పాలుపంచుకున్న వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి కొండాపూర్ ఆర్య వైశ్య సంఘం తరపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి మండల అధ్యక్షులు మాశెట్టి ప్రభాకర్ గుప్తా, మండల మహిళా సంఘం తరపున శ్రీమతి సిల్వర్ రేఖా గుప్తా, శ్రీమతి ఉప్పుగండ్ల లావణ్య గుప్తా, శ్రీమతి బాదం లక్ష్మి గుప్తా, ఆర్యవైశ్య సంఘం కొండాపూర్ పీఎస్టీ నాయకులు ఉప్పుగండ్ల ఆనంద్ గుప్తా, గంప సంతోష్ గుప్తా, యంసానీ కమలాకర్ గుప్తా, యువజన సంఘం నాయకులు వెనిశెట్టి దినేష్ గుప్తా, కాసం అనిల్ గుప్తా, ఆర్గనైజింగ్ సెక్రెటరీ మిడిదొడ్డి రాజేష్ గుప్తా, తదితర కార్యవర్గ నాయకులు హాజరై విజయవంతం చేశారు.