తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ వైస్ చైర్మన్‌గా నియమితులైన ఎం.డి. నయీమ్ కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీ హేమ దుర్గా భవన్‌లోని కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బండి రమేష్ ఎం.డి. నయీమ్ కు శాలువా కప్పి, స్వీట్లు అందించి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మైనారిటీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు, పార్టీకి మంచి సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, రమేష్, తుము సంతోష్, మోసిన్, నజీర్, నవాజ్ తదితరులు పాల్గొన్నారు.

You missed