తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ పీజేఆర్ స్టేడియంలో రాగం సుజాత నాగేందర్ యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీమతి రాగం సుజాత యాదవ్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన మెగా బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా పండుగ వాతావరణాన్ని తలపించేలా ఘనంగా నిర్వహించిన వేడుకలలో మైత్రి హైస్కూల్ విద్యార్థులు పాల్గొని రంగురంగుల సుందరమైన పూలతో జీవకళ ఉట్టిపడేలా అందంగా రూపొందించిన బతుకమ్మలతో వేడుకలకు విచ్చేసిన ప్రతి ఒక్కరిని అబ్బురపరిచారు. ఈ క్రమంలో వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ సలహాదారు. వి. హనుమంతరావు, పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ, రాష్ట్ర యాదవ కురుమ కో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ ఎం రఘునాథ్ యాదవ్ , ఉమెన్ కమిషన్ మాజీ చైర్పర్సన్ శ్రీమతి త్రిపురాన వెంకటరత్నం, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. జగదీశ్వర్ గౌడ్ , హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ , చందానగర్ సీఐ. శ్రీధర్, పురప్రముఖులు, సీనియర్ నాయకులందరూ కార్యక్రమాన్ని జయప్రదం చేయటంలో పాలుపంచుకున్న మైత్రి హైస్కూల్ యాజమాన్యాన్ని, విద్యార్థులను హృదయపూర్వకంగా అభినందించారు. అనంతరం, మైత్రి హైస్కూల్ యాజమాన్యం వారు విద్యార్థులతో కలిసి స్వర్గీయ రాగం సుజాత యాదవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగ మైత్రి హైస్కూల్ యాజమాన్యం వారు మాట్లాడుతు, ప్రజా సేవలో అండగా నిలిచిన రాగం సుజాత యాదవ్ లేరనే బాధ మాటల్లో చెప్పలేననిదని వారికి అత్యంత ఇష్టమైన బతుకమ్మ పండుగను జయంతి రోజున ఘనంగా నిర్వహించిన వేడుకలలో పాలుపంచుకునే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలను తెలియజేస్తు, స్వర్గీయ శ్రీమతి రాగం సుజాత యాదవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
