తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శ కాలనీలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలను మహిళలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయత, ఐక్యత, ప్రకృతిపై ప్రేమను చాటిచెప్పే బతుకమ్మ వేడుకలు కాలనీలో పండుగ వాతావరణాన్ని నింపాయి.ఈ సందర్భంగా మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో ఉత్సాహంగా సందడి చేశారు. తెలంగాణ మట్టి పరిమళాన్ని, పల్లె సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ వేడుకల్లో మహిళలు ఆనందోత్సాహాలతో పాల్గొని సంప్రదాయాలను చాటిచెప్పారు.అనంతరం వెంకన్నగుట్టలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కోనేరులో బతుకమ్మలను నిమజ్జనం చేసి భక్తిశ్రద్ధలతో వేడుకలను ముగించారు. తరతరాలుగా వస్తున్న తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో బతుకమ్మ పండుగ కీలక పాత్ర పోషిస్తుందని ఈ వేడుకలు మరోసారి చాటిచెప్పాయి.

You missed