తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ పీజేఆర్ స్టేడియంలో రాగం సుజాత నాగేందర్ యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీమతి రాగం సుజాత యాదవ్ జయంతిని పురస్కరించుకుని అంగరంగ వైభవంగా పండుగ వాతావరణాన్ని తలపించేలా మెగా బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆర్జీకే లోని సీనియర్ మహిళా నాయకురాలైన సజాత గౌడ్ విచ్చేసి స్వర్గీయ రాగం సుజాత యాదవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.