తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: ఓల్డ్ బోయినపల్లిలోని శివ దుర్గ ఎల్లమ్మ తల్లి సమేత దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో దండుగుల యాదగిరి నేతృత్వంలో నవరాత్రి, దసరా పర్వదినాలను పురస్కరించుకొని నిర్వహించిన అమ్మవారి ప్రత్యేక పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి రమేష్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం, దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు భక్తిభావంతో పాటు సేవా స్ఫూర్తిని, మానవత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. నవరాత్రి, దసరా పండుగలు ప్రజల్లో భక్తిభావాన్ని, ఐకమత్యాన్ని పెంపొందించాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు నిండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పుష్ప రెడ్డి, లక్ష్మయ్య, మల్లికార్జున్, షహేన్షా, అరవింద్, పులి శివకుమార్ గౌడ్, అస్లాం, శ్రావణి, దండుగుల యాదగిరి, దండుగుల అమూల్య, దేవస్థానం కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
