వరంగల్ పశ్చిమ నియోజకవర్గ SIR ప్రత్యేక ఓటరు జాబితా సవరణ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
• SIR పేరుతో ఓటు హక్కులను హరించే కుట్రలను తిప్పికొట్టాలి
• ఓటు చోరీపై ఏడాది క్రితమే రాహుల్ గాంధీ దేశానికి అవగాహన కల్పించారు
• ముఖ్యమంత్రులుగా పనిచేసిన నేతలు ఎమ్మెల్యేలుగా గెలవలేని పరిస్థితిని బీజేపీ సృష్టించింది
• వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే కాంగ్రెస్ శ్రేణుల లక్ష్యం
• ప్రజాస్వామ్య పరిరక్షణలో బూత్ స్థాయి కార్యకర్తల పాత్ర అత్యంత కీలకం
న్యూస్ డెస్క్ : వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన SIR (Special Intensive Revision) ప్రత్యేక ఓటరు జాబితా సవరణ శిక్షణ కార్యక్రమంలో TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కలసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొని బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు), పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై సమగ్ర అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ ఏడాది క్రితమే రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటు చోరీ ప్రయత్నాలపై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించి, బీజేపీ చేస్తున్న కుట్రలను దేశం ముందు బయటపెట్టారని అన్నారు. ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎంపీ విమర్శించారు.
ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన నాయకులు సైతం తమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవలేని పరిస్థితిని బీజేపీ సృష్టించిందని అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమని పేర్కొన్నారు.
SIR పేరుతో ఓటరు జాబితాల్లో మార్పులు చేసి ప్రజల ఓటు హక్కులను హరించే కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి తమ ఓటు హక్కును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రతి బూత్ స్థాయి కార్యకర్త, BLA తమ పరిధిలోని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి Enumeration Form ను తప్పనిసరిగా సక్రమంగా నింపాలని సూచించారు. ఓటరు జాబితాలో ఎలాంటి అక్రమాలు, తొలగింపులు లేదా మార్పులు జరిగినా వెంటనే స్పందించాలని సూచించారు.
వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడమే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని డాక్టర్ కడియం కావ్య పిలుపునిచ్చారు. బీజేపీ కుట్రలను తిప్పికొట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరూ ఐక్యంగా కృషి చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు.
