తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ మున్సిపాలిటీ 6వ వార్డు బేతోలు గ్రామంలో (బుధవారం) హాసేన్ హుస్సేన్ పగటి సవారి పీరీల పండుగ నిర్వహించనున్నట్లు ముస్లిం మత పెద్ద షేక్ యూసుఫ్ తెలిపారు పీరీల గుండం వద్ద భక్తులు తయారు చేసిన పాల మాటికీలతో ప్రార్థనలు (ఫాతిహాలు) ఇచ్చి పానకం పంచి పెడతారని అన్నారు భారీగా కందుర్లు చేయనున్న భక్తులు హసేన్ హుస్సేన్ సవారి పీరీల ఆశురూఖానా (కొట్టం) నుండి బయటికి తీస్తుంటే గొర్రెపోతులు కోసి ఫాతేహా (ప్రార్థనలు) నైవేద్యం సమర్పిస్తారు మొక్కుకున్న వాళ్లు కోరికలు తీరిన వాళ్లు హిందూ ముస్లింలు పెద్ద ఎత్తున రంగుల దట్టీలు కుడకలు బెల్లంతో తయారు చేసిన బాసింగాలు వెండి బంగారంతో తొట్టెలు చేసి భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లిస్తారన్నారు ఈ పండగలో ఇమామ్ హుస్సేన్ త్యాగాలను స్మరించుకుంటామన్నారు 27న మొహరం ఘనంగా నిర్వహిస్తారని అన్నారు.
