తెలంగాణ ఎక్స్ ప్రెస్, జూన్ 23: హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని హఫీజ్ పేట్ ప్రాంతంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల చిన్నారులు , సిబ్బంది అవసరాలను దృష్టిలో ఉంచుకుని బీఎల్ వై. చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బోయిని మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో 6అంగన్‌వాడీ కేంద్రాలకు గ్యాస్ స్టవ్‌ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హఫీజ్‌పేట్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ శ్రీమతి బోయిని అనూష మహేష్ యాదవ్ హాజరై అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బందికి గ్యాస్ స్టవ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చిన్నారుల ఆరోగ్యం, సంక్షేమం, అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది సౌకర్యాల కోసం అవసరమైన మౌలిక వసతులు కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. చిన్నారుల భవిష్యత్తు కోసం పనిచేసే అంగన్‌వాడీ కేంద్రాలకు తమ వంతు సహాయ సహకారాలు అందించడం ఆనందంగా ఉందని తెలిపారు.
అంగన్‌వాడీ సిబ్బంది ఈ సహాయానికి బీఎల్ వై. చారిటబుల్ ట్రస్ట్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మనోజ్ యాదవ్, అఖిల్ , సురేఖ, లక్ష్మణ్, నరేష్, మహిళలు, అంగన్‌వాడీ టీచర్లు, కాలనీవాసులు పాల్గొన్నారు.
