తెలంగాణ ఎక్స్ ప్రెస్, జూన్ 23 : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)పై పార్టీ శ్రేణుల సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తో కలిసి శేరిలింగంపల్లి బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు మారబోయిన రవి యాదవ్ పాల్గొన్నారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్ పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, బూత్ స్థాయి సమన్వయం తదితర అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు హక్కులను పరిరక్షించేందుకు, ఓటరు జాబితాలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లి పార్టీని మరింత పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని, ప్రజలతో మమేకమై పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. ఈ సమావేశంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, బూత్ కమిటీ సభ్యులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.