తెలంగాణ ఎక్స్ ప్రెస్, జూన్23 : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి జన్మదినం సందర్బంగా కూచుకుళ్ల రాజేష్ రెడ్డి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగ నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలలో పెద్దలు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు, అభిమానులు, పార్టీ శ్రేణులు, పలువురు అధికారులు, వ్యాపార, వర్తక సంఘాల ప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు, జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేకు బొకేలు అందజేసి స్వీట్లు, కేకులు తినిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడమే తనకు లభించిన అతిపెద్ద వరమని, నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.
