తెలంగాణ ఎక్స్ ప్రెస్, జూన్ 23: శేరిలింగంపల్లి డివిజన్ లోని దూబే కాలనీలో నివాసం ఉంటున్న చెన్నకేశవులు అనే కూలీపై పఠాన్చేరు నియోజకవర్గం ఇంద్రెషంలోని త్రివేణి టాలెంట్ స్కూల్ లో నిర్మాణంలో ఉన్న స్కూల్ భవనం ప్రహరీగోడ కూలి పడింది. ఈ ప్రమాదంలో చెన్నకేశవులు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న వెంటనే శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ , పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ బాధితుని నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మానవతా దృక్పథంతో స్పందించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ , కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ కలిసి నష్టపరిహారంగా 8లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని బాధితుడు చెన్నకేశవులుకు చెక్ రూపంలో అందజేసి వైద్య ఖర్చులకు తాము అన్ని విధాలా అండగా నిలుస్తామని తెలిపారు. కష్టంలో ఉన్న ప్రతి కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలవడం మా బాధ్యత అని ప్రజల సంక్షేమే మా ప్రథమ ప్రాధాన్యతని అన్నారు. కార్పొరేటర్ల సహాయానికి బాధితుని కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉప్పరి సంఘం అధ్యక్షులు శేఖర్ సాగర్, శేరిలింగంపల్లి ఉప్పరి సంఘం అధ్యక్షులు వెంకటేష్, శేరిలింగంపల్లి సగర సంఘం సభ్యులు బాధితుడి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.