• మార్కెట్ ను పరిశీలించిన చైర్ పర్సన్, వైస్ చైర్మన్, కమిషనర్ సిపిఐ టిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్లు

తెలంగాణ ఎక్స్ ప్రెస్, జూన్ 23: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 33 వ వార్డు లోగల కొత్త సమీకృత కూరగాయల మార్కెట్ ను వినియోగంలోకి వెంటనే తేవడానికి మున్సిపల్ చైర్ పర్సన్ ఛాంబర్ లో సమావేశమై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా వెంటనే కొత్త సమీకృత కూరగాయల మార్కెట్ ను మున్సిపల్ చైర్ పర్సన్ గూగులోత్ జ్యోతి రమేష్ వైస్ చైర్మన్ సుర్నపు సోమయ్య, కమీషనర్ వినోద్ కుమార్, సిపిఐ ఫ్లోర్ లీడర్ 33 వ వార్డు కౌన్సిలర్ బి అజయ్ సారధి రెడ్డి, బిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పోతరాజు మున్సిపల్ డిఈ ఉపేందర్ కలిసి పరిశీలించారు.

సుమారు 7కోట్లతో నిర్మించిన కొత్త సమీకృత కూరగాయల మార్కెట్ ను వెంటనే వినియోగంలోకి తెచ్చే విధంగా ప్రజాప్రతినిధులు పరిశీలించారు. గత మే 4 నా జరిగిన మున్సిపాలిటీ సమావేశంలో కూడా మార్కెట్ పై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా వెంటనే సమీకృత కూరగాయల మార్కెట్ను వినియోగంలోకి తీసుకువచ్చి కూరగాయల వ్యాపారస్తులకు భారం పడకుండా చూసే విధంగా కృషి చేయాలని ప్రజా ప్రతినిధులు అధికారులు నిర్ణయించారు.