తెలంగాణ ఎక్స్ ప్రెస్, జూన్ 24 : శేరిలింగంపల్లి, పాపిరెడ్డి కాలనీ నివాసితులు శ్రీమతి తన్నీరు ధనలక్ష్మి శ్రీనివాస్ దంపతుల కనిష్ట పుత్రుడు చిరంజీవి సురేష్ ను గుడ్లూరు గ్రామ వాస్తవ్యులు శ్రీమతి బెల్లంకొండ రమణమ్మ మాల్యాద్రి దంపతుల కనిష్ట పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ప్రియాంకతో బుధవారం 24వ తేదీ ఉదయం గం.10:59 నిమిషములకు బీహెచ్ ఈఎల్ టౌన్షిప్ అయ్యప్ప స్వామి టెంపుల్ సమీపంలోని అక్షయ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన దివ్య కాంతులను విరాజిల్లే సుందరమైన వేదికపై అంగరంగ వైభవంగ కన్నులపండుగగా జరిగిన వివాహ మహోత్సవానికి బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు అధిక సంఖ్యలో విచ్చేసి నూతన వధూవరులను ముత్యాల తలంబ్రాలతో ఆత్మీయతతో శుభాశీస్సులను అందజేశారు.
