తెలంగాణ ఎక్స్ ప్రెస్, జూన్ 24 : శేరిలింగంపల్లి, పాపిరెడ్డి కాలనీ నివాసితులు శ్రీమతి తన్నీరు ధనలక్ష్మి శ్రీనివాస్ దంపతుల కనిష్ట పుత్రుడు చిరంజీవి సురేష్ ను గుడ్లూరు గ్రామ వాస్తవ్యులు శ్రీమతి బెల్లంకొండ రమణమ్మ మాల్యాద్రి దంపతుల కనిష్ట పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ప్రియాంకతో బీహెచ్ ఈఎల్ టౌన్షిప్ అయ్యప్ప స్వామి టెంపుల్ సమీపంలోని అక్షయ ఫంక్షన్ హాల్ లో అంగరంగ వైభవంగ కన్నులపండుగగా జరిగిన వివాహ మహోత్సవానికి సాయి నందన్ ముదిరాజ్ వారి మిత్ర బృందంతో విచ్చేసి నూతన వధూవరులను ముత్యాల తలంబ్రాలతో శుభాశీస్సులను అందజేశారు.