తెలంగాణ ఎక్స్ ప్రెస్, జూన్ 24 : అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ,సీసీ రోడ్లపై హెచ్ ఎమ్ టీ. హెల్పింగ్ హ్యాండ్స్ జి ఎన్ ప్రసాద్ మాట్లాడుతు, హెచ్ఎమ్ట టీ స్వర్ణపురి కాలనీ, బీ. జోన్ వాసులు డా. అబ్దుల్ కలాం విగ్రహం నుండి పీ ఎన్ ఆర్ లేక్ వ్యూ చివరివరకు ప్రధాన రహదారితో పాటు అంతర్గత వీధుల్లోనూ తీవ్ర డ్రైనేజీ సమస్యలను ఎదుర్కొంటున్నారు. గత 3,-4 ఏళ్లుగా హెచ్ ఎమ్ టీ వెల్ఫేర్ అసోసియేషన్ , హెచ్ ఎమ్ టీ హెల్పింగ్ హ్యాండ్స్ అమీన్‌పూర్ మునిసిపాలిటీకి వినతులు ఇస్తూనే ఉన్నారు . ప్రతి వర్షాకాలంలో నీరు నిలిచిపోయి, డ్రైన్లు బ్లాక్ అయి అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి మురుగునీరు వస్తోంది. ఇప్పటివరకు చేసిన మరమ్మతులు తాత్కాలికమే. 15ఏళ్లకు పైగా పాతవైన ఇరుకైన పైపులు పెరిగిన జనాభాకు సరిపోవడం లేదు. కొన్ని వీధుల్లో నివాసితులు సొంత ఖర్చుతో పైపులు మార్చారు. కానీ ప్రధాన రహదారి పని మునిసిపాలిటీనే చేయాలి. మేము ప్రతి ఒక్కరినీ కలిశాము. జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ , డిప్యూటీ కమిషనర్ డీ. ప్రదీప్ కుమార్ , అప్పటి కమీషనర్ జ్యోతి రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ మనోహర్ గౌరీ శెట్టి , డీఈ. రమణ , ఏఈ. సునీల్ , వర్క్స్ ఇన్‌స్పెక్టర్, శానిటేషన్, సూపెర్వైసోర్ ఇన్‌చార్జిలను ఫోటోలతో కలిసి పలుమార్లు విన్నవించుకున్నాం. వారు మా డిమాండ్ న్యాయమైనదని అంగీకరించారు. మునిసిపల్ అధికారులందరిపైనా మాకు పూర్తి నమ్మకం ఉంది. ముఖ్యంగా డీఈ. రమణకి హెచ్ ఎమ్ టీ. స్వర్ణపురి కాలనీ డ్రైనేజీ, రోడ్ల వ్యవస్థపై ప్రతివీధి తెలిసునని వారి నిబద్ధతపై మాకు గౌరవం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2026 జూన్ 16న వర్షాకాలంలో నీరు నిలిచే ప్రాంతాలపై యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని, స్టార్మ్ వాటర్ డ్రైన్లు, మురుగు కాలువల డీ-సిల్టింగ్ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, హైడ్రా, వాటర్ బోర్డ్ అధికారులను ఆదేశించారు. ఇటీవల అమీన్‌పూర్ మునిసిపాలిటీ పరిధిలోనే బాలాజీ నగర్‌లో సీసీ. రోడ్డు పనులకు, కే ఎస్ ఆర్. కోర్ కాలనీలో సీసీ. రోడ్డు పునరుద్ధరణకు, ఇక్రిసాట్ కాలనీలో అంతర్గత సీసీ. రోడ్లకు, పీజే ఆర్ కాలనీ, కృష్ణ బృందావన్ కాలనీలలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు టెండర్లు పిలిచారు. సెప్టెంబర్ వరకు వర్షాలున్నాయి. కేవలం3 వర్షాలకే నీరు పొంగింది. ప్రతి వర్షాకాలంలో కాలనీ వాసులు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఆలస్యమైతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పిల్లలు, వృద్ధులు, స్కూల్ బస్సుల రాకపోకలకు ఇబ్బంది. తారు రోడ్లు దెబ్బతిన్నాయి. వెంటనే సీసీ. రోడ్లు వేయాలి. 5పార్కులను సొంత నిధులతో అభివృద్ధి చేసుకున్న హెచ్ ఎమ్ టీ. స్వర్ణపురి అందం డ్రైనేజీ సమస్యతో దెబ్బతింటోంది. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా, సమీప కాలనీల తరహాలోనే హెచ్ ఎమ్ టీ. స్వర్ణపురి బీ. జోన్‌లో పాత పైపుల మార్పిడికి, సీసీ. రోడ్లకు అమీన్‌పూర్ మునిసిపాలిటీ అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని వినమ్రంగా కోరుతున్నాము. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకొని, ఇతర కాలనీల మాదిరిగానే మా కాలనీకి కూడా ప్రాధాన్యత ఇచ్చి, అత్యంత త్వరగా పనులు ప్రారంభించాలని ఆశిస్తున్నామనితెలిపారు.
