తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అజ్మీర తండా గ్రామపంచాయతీ లోని రంగాపురం సబ్ సెంటర్ నందు పోలియో చుక్కలు ప్రారంభించిన సర్పంచ్ అజ్మీర రవి నాయక్ ఈయొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ అజ్మీర రవి నాయక్ మాట్లాడుతూ పుట్టినప్పటి నుండి ఐదు సంవత్సరాల వయసులో ఉన్నపిల్లలందరూ పోలియో చుక్కలు వేయించుకోవాలని పోలియో చుక్కలు వేయించుకోవడం వలన ఆ వయసులో వచ్చేటువంటి శారీరక వైకల్యాలు రాకుండా ఉంటాయని ఎవరైనా చిన్న పిల్లలు ప్రయాణంలో ఉన్నట్లయితే సంబంధిత బస్ స్టేషన్ లో గాని రైల్వే స్టేషన్ లో గాని పోలియో చుక్కలు అందుబా టులో ఉంటాయని కావున ప్రతి ఒక్కరు పుట్టినప్పటి నుండి ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరూ విధిగా ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమం లో సర్పంచ్ అజ్మీర రవితో పాటు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు యువకులు ఆశా వర్కర్లు అంగన్వాడి టీచర్లు అంగన్వాడీ సిబ్బంది గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
