తెలంగాణ ఎక్స్ ప్రెస్, పటాన్చెరు: హెచ్‌ఎమ్‌టి హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ 40మంది సభ్యులతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కలిసి హెచ్‌ఎమ్‌టి స్వర్ణపురి కాలనీలో 12 సంవత్సరాలకు పైగా అధ్వాన్నంగా ఉన్న డ్రైనేజీ, సీసీ. రోడ్ల పరిస్థితిపై వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా, సీనియర్ సామాజిక కార్యకర్త , హెచ్‌ఎమ్‌టి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధి జి.ఎన్. ప్రసాద్ డ్రైనేజీ, సీసీ రోడ్ల సమస్యలను, కాలనీ నివాసితులు, వృద్ధులు, పిల్లలు, మహిళలు నడక , వాహనాలతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్ఎల్ఏ. కు 30నిమిషాల పాటు వివరించారు. ఎమ్ఎల్ఏ. వెంటనే డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, డిఈ వెంకట రమణతో మాట్లాడి తక్షణమే స్థలాన్ని సందర్శించి, పరిశీలించి, అవసరమైతే అంచనాలు తయారుచేసి తనకు సమర్పించాలని ఆదేశించారు. సమస్యలపై సానుకూలంగా స్పందించి ఓపికగా విన్న ఎమ్మెల్యేకు, మొదటి నుంచి సహకారం , మద్దతు అందించిన మాజీ చైర్మన్ పాండురంగ రెడ్డికి, టీం సభ్యులు కృతజ్ఞులు తెలిపారు. హెచ్‌ఎమ్‌టి సభ్యులు రాములు,రాజు మద్దతుకు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. మున్సిపాలిటీ అధికారులు త్వరలోనే పనులు చేపడతారని కాలనీ నివాసితులమైన మాకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు.