వరంగల్, జూన్ 28: జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 23వ డివిజన్ కొత్తవాడ పరిధిలోని సన్ ప్లవర్ స్కూల్‌లో ఆదివారం పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించారు.
అంగన్‌వాడీ టీచర్ ముండ్రాతి (రాపోలు) రాజేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా కార్యదర్శి, జిల్లా చేనేత సెల్ కన్వీనర్ ముండ్రాతి వెంకటేశ్వర్లు పాల్గొని ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, “మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. ప్రతి తల్లిదండ్రులు 0 నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలి. ఇది సురక్షితమైనది, నొప్పిలేనిది, పూర్తిగా ఉచిత సేవ. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యవంతంగా, బలోపేతంగా ఉంటుంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మంత్రి కమలాకర్, ఆశా కార్యకర్త ముండ్రాతి మమత, గానుగ రజిత, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
