తెలంగాణ ఎక్స్ ప్రెస్, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వి.జగదీష్ గౌడ్ జన్మదినం శుభ సందర్బాన్ని పురస్కరించుకొని రాజీవ్ గృహకల్పలోని శేరిలింగంపల్లి నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు జయ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మల్లెల జయమ్మ ఆధ్వర్యంలో 100మంది హిజ్రాలకు చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వి.జగదీష్ గౌడ్ హాజరైనారు. ఈ కార్యక్రమంలో మల్లెల జయ, మల్లెల సుస్మిత, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీహర రాజన్, గడ్డం వెంకటేష్, సామెల్ కార్తీక్, పల్లె వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.