తెలంగాణ ఎక్స్ ప్రెస్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ఎన్.పి.ఆర్.డి. దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కార్యాలయం ఏవో చంద్రశేఖర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా నాయకులు బాలీశ్వర్, కుర్మయ్య మాట్లాడుతూ, దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా వెంటనే పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ 300 నుంచి 5000 రూపాయలకు పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వం బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, ప్రైవేటు పాఠశాలలో వికలాంగులకు విద్యాబోధన చేయడానికి స్పెషల్ టీచర్లను నిర్మించాలని, ఇందిరమ్మ ఇండ్లలో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బాలీశ్వర్, జిల్లా అధ్యక్షుడు కురుమయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు గనిమోని ఆంజనేయులు, లలిత్, జిల్లా నాయకుడు లింగం గౌడ్, వల్లమ్మ, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
