• సమస్యలకు నిలయాలుగా ప్రభుత్వ పాఠశాలలు
• ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యం.తారా సింగ్

తెలంగాణ ఎక్స్ ప్రెస్, 29 జూన్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ పాఠశాలలో సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తారా సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఇంకా 10 శాతం పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు ఇవ్వలేదని వారు అన్నారు ఆరవ తరగతి ఎనిమిదవ తరగతి హింది పాఠ్యపుస్తకాలు అదే విధంగా విద్యార్థులకు దుస్తులు తక్షణమే పంపిణీ చేయాలని వారు అన్నారు. విద్యార్థులకు కనీసం సరిపోను బట్ట ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదని వారు మండిపడ్డారు. ఒక విద్యార్థికి ఒక జతకు కుట్టుకొని 33 రూపాయలు మాత్రమే ఇవ్వడం వల్ల బట్టలు కుట్టడానికి ఎవ్వడు ముందుకు రావట్లేదని వారు ప్రభుత్వాన్ని విమర్శించారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో బాత్రూములు మరుగుదొడ్లు లేక విద్యార్థులు అనేక ఇబ్బందుల గురవుతున్నారని వారన్నారు. తక్షణమే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సరిపోయే మరుగుదొడ్లు బాత్రూంలో నిర్మించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శివ ప్రసాద్ శ్రీనివాసులు రవీందర్ మనోజ్ అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.