• సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశోక్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ 29 జూన్: నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలో దాదాపు పది గ్రామాలకు సంబంధించిన రైతుల యొక్క వడ్లను కొనుగోలు చేసి మోసం చేసిన వ్యక్తుల నుండి డబ్బులు ఇప్పించాలని సోమవారం కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అరవింద్ శివాజీ హసన్ అనే ముగ్గురు కలిసి దాదాపు 150 మంది రైతులతో వడ్లు కొనుగోలు చేశారని వారందరికీ దాదాపు 6 కోట్ల వరకు డబ్బులు ఇవ్వాల్సి ఉందని అన్నారు. డబ్బులు ఇవ్వకుండా ఖాళీ చెక్కులు ఇచ్చారని తీరా బ్యాంకులో కెళ్ళి చెక్కులను మార్పిడి చేసుకుందామంటే అకౌంట్లో డబ్బులు లేవని బ్యాంకు అధికారులు తెలుపగా రైతులు లబోదిబోమంటున్నారని అన్నారు. ఇట్టి విషయాన్ని బిజినపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అక్కడి పోలీస్ అధికారులు సక్రమంగా స్పందించకపోవడంతో కలెక్టర్ కి మొరపెట్టుకునేందుకు రైతులు రావడం జరిగిందని అన్నారు. ఇట్టి విషయంపై కలెక్టర్ జిల్లా ఎస్పీ తో ఫోన్లో మాట్లాడారు అనంతరం రైతులందరూ ఎస్పీ ని కలవగా నిందితుల నుండి డబ్బులు రికవరీ చేయించేందుకు ప్రయత్నం చేస్తామని స్పెషల్ టీం ఏర్పాటు చేస్తామని వారి బ్యాంకు ఖాతాలను ఫ్రీజింగ్ లో పెడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుంపల్లి అశోక్ రైతులు పాల్గొన్నారు.
