తెలంగాణ ఎక్స్ ప్రెస్, శేరిలింగంపల్లి: రాష్ట్రంలోనే అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన దివ్యాంగులను రాజకీయ పార్టీలు పట్టించుకోకపోవడం తగదని, జిహెచ్ఎంసి ఎన్నికల్లో టికెట్లు కేటాయించాలని తెలంగాణ దివ్యాంగుల సమైక్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకల అశోక్ కుమార్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. సంఘం సమావేశంలో వారు మాట్లాడుతూ , రాష్ట్ర వ్యాప్తంగా 15లక్షల మంది దివ్యాంగులు ఉన్నారని వారి కుటుంబాలతో కలుపుకొని మొత్తం 60 లక్షల ఓట్లు ఉంటాయని గెలుపోటములను ప్రభావితం చేసే తమను ఓటు బ్యాంకుగా చూడకుండా స్థానిక సంస్థల్లో దివ్యాంగులకు అవకాశం ఇవ్వాలని రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలను హెచ్చరిస్తున్నామన్నారు. లేకుంటే స్వతంత్రంగా బరిలో నిలిచి తమ సత్తా చాటుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ జనరల్ సెక్రెటరీ రామకృష్ణ, జాయింట్ సెక్రెటరీ శ్రీనివాసులు,రషీద్, నర్సింగ్ రావు మధు తదితరులు పాల్గొన్నారు.
