• రామాలయంలో వైభవంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్, 29 జూన్: జేష్ట మాసం ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో భక్తులచే నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవంగా జరిగినట్లు రామాలయ ప్రధాన అర్చకులు కందడై వరదరాజన్ అయ్యంగార్ తెలిపారు.సూక్ష్మంలో మోక్షమార్గం ప్రతి ఒక్కరు శక్తి కొలది స్వామివారిని పూజించాలని తెలిపారు. అనంతరం తీర్థప్రసాదాలతో పాటు వేద ఆశీర్వచనం చేశారు. రామాలయ అన్న ప్రసాద కమిటీ వారిచే పాల్గొన్న భక్తులందరికీ సామూహిక అన్నప్రసాద పంపిణీ చేశారు. రామాలయ భజన కమిటీ సభ్యులు ప్రత్యేక భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అర్థం రవీందర్,మల్లేష్ , మన్నెపు రెడ్డి,గొల్ల రాములు, శ్రీనివాసులు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
