తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం:
మియాపూర్ డివిజన్ మక్తా మహబూబ్‌పేట్‌లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగల గురించి బీజేపీ నాయకులు, గుండె గణేష్ ముదిరాజ్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగ గుండె గణేష్ ముదిరాజ్ మాట్లాడుతు, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలపై పలుమార్లు టీ జీ ఎస్పీడీసీఎల్ కు ఫిర్యాదు చేసినా విద్యుత్తు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వర్షాకాలంలో షార్ట్‌సర్క్యూట్‌లు, నిప్పురవ్వలు ఎగురుతున్నప్పటికీ ఇప్పటికీ శాశ్వత చర్యలు తీసుకోలేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని వెంటనే పాత తీగలను తొలగించి కొత్త కేబుళ్లు ఏర్పాటు చేయాలని ఏదైనా ప్రమాదం జరిగితే దానికి పూర్తి బాధ్యత సంబంధిత అధికారులదేనని హెచ్చరిస్తున్నామన్నారు.
