తెలంగాణ ఎక్స్ ప్రెస్, శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్, రాఘవేంద్ర కాలనీ, మార్తాండనగర్, ప్రేమ్ నగర్, హఫీజ్‌పేట్ లోని చాలా వీధి దీపాలు వెలగడం లేదని కొండాపూర్ డివిజన్ బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు మహమ్మద్ అలావుద్దీన్ పటేల్ జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ హేమంత్ ను వారి బృందాన్ని కలిసి ఈ విషయంపై తక్షణ చర్యలు తీసుకుని ప్రజలకు ఉపశమనం కలిగించాలని అభ్యర్థించారు. ముఖ్యంగా వృద్ధులకు రాత్రి షిఫ్టులలో పనిచేసే వారికి తీవ్రమైన సమస్యగా మారిందని అంతేకాకుండా, చీకటి కారణంగా స్థానికులకు కుక్క కాట్లు శారీరక గాయాలయ్యే ప్రమాదం నిరంతరం పొంచి ఉందని ఈ విషయంపై తక్షణ చర్యలు తీసుకుని ప్రజలకు ఉపశమనం కలిగించాలని అభ్యర్థించారు.