తెలంగాణ ఎక్స్ ప్రెస్, శేరిలింగంపల్లి నియోజకవర్గం: మియాపూర్ సర్కిల్ పరిధిలోని ప్రధాన రహదారికి ఆనుకొని సెల్లార్లలో వ్యాపారాలు చేస్తున్నారని, వచ్చేది వర్షాకాలం ఇట్టి సెల్లార్లలో నీరు నిండి కరెంటు షార్ట్ సర్క్యూట్ అయి అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయే అవకాశం ఎంతైనా ఉందని కావున తమరి కిందిస్థాయి అధికారులను పంపించి పరిశీలించి వెంటనే సెల్లార్ల లోని వ్యాపార సముదాయాలను ఖాళీ చేయించి ప్రజల ప్రాణాలను కాపాడగలరని ప్రజావాణిలో మిద్దెల మల్లారెడ్డి ఫిర్యాదుచేశారు. గత సంవత్సరంలో ఒకరాత్రి కురిసిన వానకే విజేత సూపర్ మార్కెట్ కింద సెల్లార్ లో మొత్తం నీరు నిండి కోట్ల రూపాయలు నష్టం జరిగిందని అద్రుష్టవశాత్తు ప్రాణా నష్టం జరగలేదని కావున ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఎంతైనా ఉందని అందువలన వెంటనే సెల్లార్ల లోని వ్యాపార సముదాయాలు ఖాళీ చేయించాలని ముఖ్యంగా భవాని హార్డ్వేర్ షాప్ అర్చన హాస్పిటల్ విజేత సూపర్ మార్కెట్ కింద ఇలా చాలా సెల్లార్లలో వ్యాపారాలు జరుగుతున్నాయని కావున వెంటనే ఖాళీ చేయించి ప్రజల ప్రాణాలు కాపాడగలరని మిద్దెల మల్లారెడ్డి కోరారు.
