తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం : ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని జయశంకర్ కాలనీలో రేనోవా హాస్పిటల్ వారి సహకారంతో నిర్వహించిన ఉచిత వైద్య పరీక్షల శిబిరానికి సీనియర్ నాయకులు కుమార్ యాదవ్ ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై వైద్య శిబిరం అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, బి.పి, షుగర్ వంటి అన్ని జనరల్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్న వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ప్రజలందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వైద్య నిపుణులు అందిస్తున్న సలహాలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో శశిధర్ పట్వారీ, అరుణ, షౌకత్ ఆలీ మున్నా, రాజుగౌడ్, వెంకటకృష్ణ,రఫీ,రాజమణి, కాలనీవాసులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.