ఖమ్మం న్యూస్: ప్రముఖ ఛెస్ట్ ఫిజీషియన్ డాక్టర్ రమేష్ బాబు తల్లి బోడగల సుగుణమ్మ (86) ఈరోజు మధ్యాహ్నం శివైక్యం చెందారు. ఆమె మృతి పట్ల పలువురు సామాజిక, వైద్య, ప్రజా ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమర్థపు మురళి ప్రగాఢ సంతాపం తెలిపారు. బోడగల సుగుణమ్మ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని డాక్టర్ రమేష్ బాబు గారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు.
సుగుణమ్మ గారి మరణం కుటుంబ సభ్యులకు తీరని లోటని పేర్కొంటూ, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని కమర్థపు మురళి తెలియజేశారు. కుటుంబ సభ్యులు ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
