కామారెడ్డి జిల్లా (జులై 14): కామారెడ్డి జిల్లా పెద్దకొడప్‌గల్ మండలంలోని చిన్నతక్కడపల్లి గ్రామపంచాయతీలో నేడు కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియను అదనపు కలెక్టర్ విక్టర్ పరిశీలించారు.
ఇంటింటి సర్వే, దరఖాస్తుల స్వీకరణ, ఫారాల నమోదు, అర్హుల వివరాల సేకరణ తదితర అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ విక్టర్ అన్నారు.
ప్రజలకు అవసరమైన అవగాహన కల్పిస్తూ, ప్రతీ అర్హుల వివరాలు ఇలాంటి తప్పులు లేకుండా సక్రమంగా నమోదు చేయాలని ఆదేశించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి ఎస్‌ఐఆర్(SIR) ప్రక్రియకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజశేఖర్, సర్పంచ్ వినోద్, మండల అధికారులు, గ్రామపంచాయతీ సిబ్బంది, బూత్ లెవల్ అధికారులు (BLOలు), సర్వే సిబ్బంది పాల్గొన్నారు.
