సిద్దిపేట పట్టణంలోని రంగధాంపల్లి చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన కావ్య హోటల్’ బుధవారం వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి వంగ రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, రిబ్బన్ కట్ చేసి హోటల్‌ను అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వంగ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. హోటల్ నిర్వాహకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. వినియోగదారులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందిస్తూ ప్రజల మనసులు గెలుచుకోవాలని ఆయన ఆకాంక్షించారు. వ్యాపార రంగంలో హోటల్ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఇలాంటి వ్యాపార సంస్థలు మరిన్ని ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హోటల్ యాజమాన్యం, స్థానిక ప్రముఖులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
