ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) పేద ప్రజలకు ఒక గొప్ప వరమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మీసం నాగరాజ్ యాదవ్ పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమం, అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి ఆదేశాల మేరకు.. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్న బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, శివ ప్రసాద్‌లకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మీసం నాగరాజ్ యాదవ్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.ఈ కష్టకాలంలో ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయం తమకు ఎంతో ఆసరాగా నిలుస్తుందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కల్లూరి నర్సింలు, పంజా కుమార్, అనిల్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.
