జగిత్యాల జిల్లా/మెట్ పల్లి: జడల మహేష్ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. గురువారం రాష్ట్ర చేనేత ఐక్యవేదిక మండలి వైస్ చైర్మన్ జడల ప్రభాకర్ కుమారుడు జడల మహేష్ పుట్టినరోజు సందర్భంగా మెట్ పల్లి ప్రభుత్వ ఉన్నంత పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు. ఇట్టి స్వచ్ఛంద కార్యక్రమం సందర్భంగా సామాజిక సేవకుడైన జడల ప్రభాకర్ విద్యార్థులకు సమాజానికి మన వంతు ఏదోవిధంగా సేవ చేయడం ఒక బాధ్యత అని, సందేశాత్మక సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సుఖీభవ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు బొక్కెనపల్లి నాగరాజు, మాజీ ఎంపీపీ తొగిటి అంజయ్య, రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ నాయకులు నాంపల్లి గట్టయ్య, పొలాస రాజేశ్వర్, జ్ఞాన హితు, ప్రధాన ఉపాధ్యాయులు మధుకర్ సహా ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Avatar photo

By Murthy