తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ప్రపంచ యోగ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించి దేశానికి, రాష్ట్రానికి కీర్తి తీసుకొచ్చిన సతీష్‌ను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమం గోకరి సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. సతీష్ సాధించిన విజయం యువతకు ఆదర్శంగా నిలుస్తుందని, మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో యోగా గురువులు వెంకటేష్, నరసింహ గౌడ్, ఉమేష్ తదితరులు పాల్గొని సతీష్‌ను అభినందించారు.
