తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శంషాబాద్ మండలం బహదుర్గూడలో రైతుల భూములను స్వాధీనం చేసుకునే ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ నిర్వహించిన రైతుల నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు మద్దతు ప్రకటించారు. రైతులకు అన్యాయం జరగకుండా భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసనలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, 118 డివిజన్ అధ్యక్షుడు ప్రదీప్ రెడ్డి, 119 డివిజన్ అధ్యక్షుడు కోణమొల్ల శ్రీనివాస్, చెక్కల ఎల్లయ్య, 118–119 డివిజన్ల కోఆర్డినేటర్ బుచ్చి రెడ్డి, రాజేందర్, పరంధాములు, రాహుల్, జనార్ధన్, మల్లేష్ ముదిరాజ్, పరమేశ్వరి, చరణ్, అర్జున్, సాగర్, వెంకట్ రెడ్డి, హనుమంతు, శ్రీకాంత్, రాచమల్ల రమేష్, గౌస్, మురళి గౌడ్, దీపక్ గౌడ్, శివ గౌడ్‌తో పాటు రెండు డివిజన్ల ముఖ్య నాయకులు, మండల ముఖ్య నాయకులు పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు.
ప్రభుత్వం రైతుల అభిప్రాయాలను గౌరవించి, వారి భూములకు ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.
