తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: 20న రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట నిర్వహించ నున్న “ఛలో కలెక్టరేట్” ధర్నాను విజయవంతం చేయాలని శివరాంపల్లి బీసీడబ్ల్యూ వర్కర్స్ యూనియన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు కరపత్రాలు విడుదల చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం శివరాంపల్లి యూనియన్ అధ్యక్షుడు పి. శ్రీనివాస్, కార్యదర్శి ముడావత్ రేఖ్యా నాయక్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిం చారు. లేబర్ కార్డు రద్దు బెదిరింపులు ఆపాలని, గృహాలు, కనీస సౌకర్యాలు, స్కాలర్‌షిప్‌లు, పింఛన్ వంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జూలై 20న జరిగే ధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు. కార్యక్రమంలో కే. శంకర్, బుగ్గన, పాండు నాయక్, వీరన్న, విజయ్ కుమార్, ఆకుల యాదయ్య, బాణావత్ శంకర్, యాదన్న, మండల శంకర్, ప్రభాకర్, క్రాంతి రెడ్డి, శమంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
