తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని వెంకటేశ్వర కాలనీ, నేతాజీ నగర్, శ్రీరామ్ నగర్ బస్తీల్లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారం, అలాగే రానున్న బోనాల పండుగ ఏర్పాట్లపై ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌ను స్థానిక నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు.
వినతిపత్రంలో ప్రధానంగా కాలనీల్లోని దెబ్బతిన్న రోడ్లు, వీధి దీపాల కొరత కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, తక్షణమే అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. అదేవిధంగా బోనాల పండుగ సందర్భంగా ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ వెలుగులు, అలంకరణ తదితర ఏర్పాట్లకు ప్రభుత్వ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వినతిపై ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సానుకూలంగా స్పందిస్తూ, బస్తీల్లోని సమస్యలను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు బోనాల పండుగ ఏర్పాట్లు ఘనంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు దన్ను, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సరికొండ వెంకటేష్, బాబురావు, గోపాల్, అనంతం తదితరులు పాల్గొని కాలనీల పరిస్థితులను ఎమ్మెల్యేకు వివరించారు.
