తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: ఆషాడ మాసం తొలి రోజున గోల్కొండలోని శ్రీ మహంకాళి అమ్మవారు, శ్రీ జగదాంబ అమ్మవార్లను ఆడికే మహేందర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, తెలంగాణలో బోనాల వేడుకలు వైభవంగా జరగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఆషాడ మాసం సందర్భంగా గోల్కొండలో ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.