తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: చందానగర్ డివిజన్ పరిధిలోని మిరియాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ శానిటేషన్ కార్మికులకు ఉచిత గొడుగుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ మిరియాల ప్రీతమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వర్షాకాలంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కల్పించే ఉద్దేశంతో గొడుగులను అందజేశారు. ఈ సందర్భంగా మిరియాల ప్రీతమ్ మాట్లాడుతూ, ఎండా వానా తేడా లేకుండా నగర పరిశుభ్రత కోసం నిరంతరం కృషి చేస్తున్న శానిటేషన్ కార్మికుల సేవలు అమూల్యమైనవని అన్నారు. వారి సంక్షేమం కోసం మిరియాల చారిటబుల్ ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్ మిరియాల సుగుణ గారు, మిరియాల యామిని గారు పాల్గొని కార్మికులకు గొడుగులను పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని శానిటేషన్ కార్మికులు అభినందిస్తూ ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.